కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా రూపొందుతున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం తాజాగా టీజర్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో హీరో అజిత్ కుమార్‌తో పాటుగా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని చూపించారు.
కాగా, ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, సునీల్, ప్రభు ఇతక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, అజిత్ కుమార్ ఇటీవల తెలుగులో పట్టుదల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. దీంతో అజిత్ అభిమానూలు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.

