ఐకాన్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. పుష్ప పార్ట్ 1 సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ క్రమంలోనే అమిర్ ఖాన్ దంగల్ తర్వాత (రూ. 2,070 కోట్లు) ఇండియాలోనే రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, బాహుబలి లాంటి సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.
అయితే ఈ సినిమా విడుదలై మార్చి 14నాటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పుష్ప 2 ది రూల్.. 100 డేస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలు కొడుతూ.. ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా, పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. కాగా, ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. Pushpa, Allu Arjun
https://twitter.com/MythriOfficial/status/1900546918138380757

