‘సికందర్‌’ నుంచి హోలీ సర్‌ప్రైజ్.. ‘భమ్ భమ్ భోలే’ అంటూ.!

by | Mar 11, 2025 | సినిమా

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్, కాంబినేషన్ లో వ‌స్తున్న తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో చిత్రం త‌ర్వాత మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ మూవీ రానుండ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. సత్యరాజ్‌, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీకరణ శ‌ర‌వేగంగా జరుగుతుండగా… రంజాన్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్‌ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌, టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా సికందర్ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘భమ్ భమ్ భోలే’ అంటూ సాగే ఈ సాంగ్ ను హోలీ రంగుల నేపథ్యంలో రూపొందించారు. ఈ సాంగ్ లో సల్మాన్ ఖాన్, రష్మిక వేసిన స్టెప్పులు అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లో కాజల్ అగర్వాల్ కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.