ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టు న్యూజిలాండ్ ను ఓడించి మూడవసారి ఛాంపియన్స్ ట్రోఫీ ని కైవసం చేసుకుంది.
శ్రేయాస్ అయ్యర్ అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడు. అయితే మొత్తం టోర్నీ లో రచిన్ రవీంద్ర అత్యధిక పరుగులు సాధించిన అఆటగాడు. రచిన్ రవీంద్ర 4 మ్యాచ్ లలో 263 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ (Shreyas Ayyar) 5 మ్యాచ్ లలో 243 పరుగులు చేశాడు. టోర్నీ లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో విరాట్ కోహ్లీ 218 పరుగులతో ఐదవ స్థానంలో ఉన్నాడు
ఇక బౌలర్ల విషయానికి వస్తే టోర్నీ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ 4 మ్యాచ్ లలో 10 వికెట్ లు తీసిన హెన్రీ. అయితే ముగ్గురు బౌలర్ లు, టోర్నీ మొత్తంగా 9 వికెట్ లు తీశారు. వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy), షమీ, సాంట్నర్ లు తొమ్మిదేసి వికెట్లు తీశారు. అయితే కేవలం 3 మ్యాచ్ లు ఆడి 9 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి భారత జట్టు తరపున బెస్ట్ బౌలర్. షమీ 5 మ్యాచ్ లు ఆడి 9 వికెట్ లు తీశాడు
టోర్నీ లో 263 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్ లు తీసిన రచిన్ రవీంద్ర ప్లేయర్ అఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు
అయితే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ (రచిన్ రవీంద్ర) , అత్యధిక వికెట్ లు తీసిన బౌలర్ (హెన్రీ) , ఇద్దరు న్యూజిలాండ్ కు చెందినవారే అవడం విశేషం
హెన్రీ (Henry) ఎకానమీ రేట్ 5.32 , అయితే వరుణ్ చక్రవర్తి ఎకానమీ రేట్ 4.53 గా ఉంది. ఎలా చూసిన వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ బౌలర్

