యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్లో ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ తో యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ వార్ 2 (WAR) మూవీ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ (NTR) మధ్య అదిరిపోయే డ్యాన్స్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో వీరిద్దరూ ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యష్‌రాజ్ స్టూడియోలో ఈ క్రేజీ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సాంగ్ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు హృతిక్ రోషన్ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అటు హృతిక్ ఫ్యాన్స్ తో పాటుగా ఇటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఇటీవలే ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్ మధ్య కొన్ని భారీ యాక్షన్ సీన్స్ కూడా షూట్ చేశారు. అయితే, తాజాగా ఈ సాంగ్ కోసం యశ్‌రాజ్ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను వేయగా.. ఇందులో దాదాపు 500మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో హృతిక్ రోషన్ గాయపడటంతో షూటింగ్‌ను మధ్యలొనే ఆపేసినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో నాలుగు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగష్టు 14న ఈ సినిమా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుండగా.. హృతిక్ గాయంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన వార్ 2 గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా, యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో 6వ చిత్రంగా, 2019లో వచ్చిన ‘వార్’ సీక్వెల్ గా ‘వార్ 2’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ (NTR) నెగిటివ్ షేడ్స్ ఉండే స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

