ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ మూవీ.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటంటే.?

by | Mar 10, 2025 | సినిమా

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ హారర్‌ చిత్రం ‘ది రాజాసాబ్‌’. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తున్న రాజాసాబ్‌ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించగా.. సినిమా వాయిదా పడనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ టీజర్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. అలాగే ఈ సినిమాలో ఇంకా మూడు సాంగ్స్ షూట్ చేయాల్సి ఉందని, కానీ కథానాయికలు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ డేట్స్ లేకపోవడంతో చిత్రీకరణ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. దాంతో పాటుగా ‘రాజాసాబ్’ మూవీ రన్ టైమ్ మూడున్నర గంటలు వచ్చిందని హార్రర్ కామెడీ జోనర్ చిత్రాలకు ఇంత భారీ రన్‌టైమ్ ఎక్కువ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. దాంతో చాలా ఫుటేజ్ కు కత్తెర వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణాలతో ‘రాజాసాబ్ (Rajasaab)’ మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, ‘రాజా సాబ్’ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది