టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa). ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫస్ట్ సింగిల్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. కొన్ని రోజుల క్రితం శివయ్య అంటూ సాగే ఫస్ట్ సింగ్ రిలీజ్ చేయగా అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని లవ్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో మంచు విష్ణు తిన్నడు అనే పాత్రలో నటించనుండగా… ఇతడి ప్రియురాలు నెమలి అనే పాత్రలో ప్రీతి ముకుందన్ కనిపించనుంది. వీరిద్దరి ప్రేమల మధ్య తీసిన ‘లవ్ సాంగ్’ను మేకర్స్ విడుదల చేశారు. మైథలాజికల్ చిత్రం అయినప్పటికీ, ఇందులో ప్రేమను యాక్షన్‌ను సమపాళ్లలో అందించినట్లు తెలుస్తోంది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా స్టీఫెన్ దేవస్సి మ్యూజిక్ అందించారు.
కాగా, ఇక మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప (Kannappa) చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ‘కన్నప్ప’ మూవీలో ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమల్లో పేరొందిన ఎందరో నటీనటులు భాగమాయ్యరు. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుతో పాటుగా శరత్‌కుమార్, మధుబాల, ముఖేష్‌రిషి, బ్రహ్మానందం బ్రహ్మాజీ, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

