సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సన్‌పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. రజినీకాంత్ ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanakaraj) దర్శకత్వంలో కూలీ (Coolie) చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి శృతిహాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే జైలర్ 2 చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలోనే జైలర్ 2 టీజర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్. హుకుం సాంగ్‌తో సాంగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఇదిలాఉంటే సినీ ప్రియులు, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జైలర్ 2 షూటింగ్ అప్‌డేట్ రానే వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం జైలర్ 2 సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ మార్చి 10న సోమవారం చెన్నైలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ మార్చి చివరి వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది ఈ షెడ్యూల్ లో రజినీకాంత్ తో పాటుగా ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అనంతరం ఏప్రిల్ లో ఈ మూవీ రెండో షెడ్యూల్ గోవాలో మొదలవనుందని సమాచారం. ఇందులో రజినీకాంత్ (Rajanikanth), ముత్తువెల్ పాండియన్ గా పవర్ ఫుల్ అల్ట్రా స్టైలిష్ పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు. కాగా జైలర్ (Jailer) తొలి భాగంలో కీలక పాత్రలు పోషించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, వినాయకన్, యోగిబాబులు ఇందులో కూడా నటించనున్నారు. సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్ పై కళానిధి మారన్ జైలర్ 2 ను భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు

