‘లాపతా లేడీస్’కు ఏకంగా 10.. ‘ఐఫా’ అవార్డ్స్‌ 2025 విజేతలు వీరే!

by | Mar 10, 2025 | సినిమా

ప్రతిష్టాత్మక ‘ఐఫా’ అవార్డ్స్‌ 2025 జైపూర్‌లో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్‌ అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులతో పాటుగా షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్‌, శ్రేయా ఘోషల్‌, కరణ్‌ జోహార్, బాబీ డియోల్‌ వంటి సినీ తారలు సందడి చేశారు. జైపుర్‌లో రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఐఫా సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో మహిళా తారలు ‘ది జర్నీ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ సినిమా’ పేరుతో జరిగిన చర్చలో తమ గళాన్ని వినిపించారు. శని, ఆదివారాల్లో డిజిటల్ అవార్డులు ప్రకటించగా.. ఆదివారం రాత్రి సినిమా అవార్డులు అందించారు. ఇందులో ‘లాపతా లేడీస్’ సినిమా ఏకంగా 10 అవార్డులు అందుకోవడం విశేషం.

‘ఐఫా’ అవార్డుల విజేత‌ల జాబితా ఇదే

◆ ఉత్తమ చిత్రం: లాపతా లేడీస్
◆ ఉత్తమ నటుడు: కార్తీక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)
◆ ఉత్తమ నటి: నితాన్షి గోయెల్ (లాపతా లేడీస్)
◆ ఉత్తమ దర్శకురాలు: కిరణ్ రావు (లాపతా లేడీస్‌)
◆ ఉత్తమ విలన్‌: రాఘవ్ జుయల్ (కిల్‌)
◆ ఉత్తమ సహాయ నటి: జాంకీ బోడివాలా (షైతాన్)
◆ ఉత్తమ సహాయ నటుడు: రవి కిషన్‌ (లాపతా లేడీస్‌)
◆ ఉత్తమ దర్శకుడు: (డెబ్యూ) – కునాల్ కేము (మడ్గావ్ ఎక్స్‌ప్రెస్)
◆ ఉత్తమ నటి: (డెబ్యూ) – ప్రతిభా రంతా (లాపతా లేడీస్)
◆ ఉత్తమ నటుడు: (డెబ్యూ) – లక్ష్య (కిల్)
◆ ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్
◆ ఉత్తమ నేపథ్య గాయకుడు: జుబిన్ నౌటియల్
◆ ఉత్తమ సంగీత దర్శకుడు: రామ్ సంపత్ (లాపతా లేడీస్)
◆ ఉత్తమ సాహిత్యం: ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్‌)
◆ ఉత్తమ కథ (ఒరిజినల్‌): బిప్లబ్ గోస్వామి (లాపతా లేడీస్)
◆ ఉత్తమ కథ (ట్రాన్స్లేట్): శ్రీరామ్ రాఘవన్ (మేరీ క్రిస్మస్‌)
◆ బెస్ట్ ఎడిటింగ్: జబీన్ మర్చంట్ (లాపతా లేడీస్)
◆ ఉత్తమ కొరియోగ్రఫీ: బోస్కో-సీజర్ (బాడ్ న్యూజ్ : తౌబా తౌబా)
◆ ఉత్తమ సినిమాటోగ్రఫీ: రఫీ మహమూద్ (కిల్‌)
◆ ఉత్తమ డైలాగ్స్: అర్జున్ ధావన్, ఆదిత్య ధర్, ఆదిత్య సుహాస్ జంభలే, మోనాల్ థాకర్ (ఆర్టికల్ 370)
◆ ఉత్తమ స్క్రీన్‌ప్లే: స్నేహ దేశాయ్‌ (లాపతా లేడీస్‌)