నవ్వులు పూయిస్తోన్న హోమ్ టౌన్ టీజర్ ; 100 కు 116 మార్కులు

by | Mar 10, 2025 | టీవీ & ఓటిటి

రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రలలో ఆహా వారి ‘హోమ్ టౌన్’ టీజర్ విడుదలయింది.  ఏప్రిల్ 4 నుండి హోమ్ టౌన్ ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది

ఈటీవీ విన్ లో ఉన్న 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ తరహా లో ఉంది.  ఇందులో శివాజీ, వాసుకి జంటగా నటిస్తే, హోమ్ టౌన్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ జంటగా నటించారు.  90’s మిడిల్ క్లాస్ బయోపిక్ ఉన్న కొంతమంది నటి నటులు ఇందులో కూడా కనిపిస్తున్నారు.  నవీన్ మేడారం నిర్మిస్తోన్న ఈ సిరీస్ కు  రాజశేఖర్ మేడారం నిర్మాత. శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహిస్తున్నారు