తెర వెనుక ‘కన్నప్ప’ ఇలా.. మేకింగ్‌ వీడియో చూశారా

by | Mar 10, 2025 | సినిమా

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa) మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే టీజర్లు, ఫస్ట్ సింగిల్ రిలీజ్‌ చేయగా తాజాగా మేకింగ్‌ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ వీడియోలో సాంకేతిక నిపుణులతో విష్ణు చర్చిస్తున్నట్లు విజువల్స్ కనిపించాయి. ఈ సినిమా తెర వెనుక సంగతులతో ఆసక్తికరంగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, ‘కన్నప్ప’ (Kannappa) మూవీలో హీరోయిన్ గా ‘ఓం భీమ్ బుష్’ ఫేమ్ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ (Kajal) పార్వతీ దేవిగా అలరించబోతున్నారు. అలానే మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్ , బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో రుద్ర పాత్రను పోషించారు. పలు ఇండస్ట్రీలకు చెందిన యాక్టర్స్ ఈ మూవీలో నటిస్తుండటంతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కాగా, పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు.