టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఇటీవలి సూపర్ హిట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దాంతో హీరో వెంకటేష్ కెరీర్లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది. ఇందులో వెంకటేష్ (Venkatesh) నటనకు, కామెడీ టైమింగ్ కు అభిమానులు నీరాజనం ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ (Venkatesh) కథలు వింటున్నారని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో వెంకటేష్ తన తదుపరి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వివి వినాయక్ (Vinayaka) ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా వెలుగొందారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన దిల్, ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్ కృష్ణ, అల్లుడు శీను వంటి సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. అలాగే వెంకటేష్ – వినాయక్ కాంబినేషన్లో గతంలో ‘లక్ష్మి'(2006) అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కోసం ఓ పవర్ఫుల్ కథను వెంకీకి వివి వినాయక్ (Vinayak) వినిపించాడని సమాచారం. వినాయక్ స్క్రిప్ట్ విషయంలో వెంకీ సంతృప్తి వ్యక్తం చేశాడని త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. లక్ష్మీ (Lakshmi) సినిమాని నిర్మించిన నల్లమలుపు బుజ్జినే ఈ మూవీని నిర్మించనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా సక్సెస్ లోని లేని వివి వినాయక్ ఈ సినిమాతో ఎలాగైనా ట్రాక్ లోకి రావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని తెలుస్తున్నది.

