ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో 252 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు మొదటి వికెట్ కు 105 పరుగులు జోడించారు. ఆ తరవాత వచ్చిన విరాట్ కోహ్లీ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. కోహ్లీ అవుట్ అయ్యిన కొద్దిసేపటికే 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు
మరోసారి శ్రేయాస్ అయ్యర్ ఆపద్బాంధవుడయ్యాడు. శ్రేయాస్ అయ్యర్, అక్ష పటేల్ లు నాలుగవ వికెట్ కు 61పరుగులు జోడించారు
శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు, అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తరవాత వచ్చిన రాహుల్, పాండ్య లు ఆరవ వికెట్ కు అజేయంగా 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 18 పరుగులు చేసిన పాండ్య, జెమిసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
49 ఓవర్ల లో భారత్ 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి విజయం సాధించింది. రాహుల్ 34 పరుగులతో, జడేజా 9 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు.
న్యూజిలాండ్ బౌలర్ల లో సాంట్నర్, బ్రేస్ వెల్ లు రెండేసి వికెట్లు తీయగా, రచిన్ రవీంద్ర, జెమిసన్ తలా ఒక వికెట్ తీశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ లలో న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది
మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ ను ధాటిగానే ఆరంభించింది. మొదటి వికెట్ కు విల్ యంగ్, రచిన్ రవీంద్రలు 57 పరుగులు జోడించారు. 15 పరుగులు చేసిన విల్ యంగ్ అవుట్ అయిన తరవాత క్రమం తప్పకుండా న్యూజిలాండ్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. న్యూజిలాండ్ కీలక ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, విలియమ్సన్ లను స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెంట వెంట ఓవర్ లలో అవుట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన టామ్ లేధం కూడా 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 108 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టును మిచెల్, ఫిలిప్స్ లు ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదవ వికెట్ కు 57 పరుగులు జోడించారు. 34 పరుగులు చేసిన, ఫిలిప్స్ ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు
మిచెల్, బ్రేస్ వెల్ లు ఆరవ వికెట్ కు 46 పరుగులు జోడించారు. 101 బంతుల్లో 63 పరుగులు చేరిన మిచెల్ ను షమీ అవుట్ చేశాడు. ఆ తరవాత వచ్చిన కెప్టెన్ సాంట్నర్ తో జత కలిసిన బ్రేస్ వెల్ స్కోర్ బోర్డు ను మెల్లి మెల్లిగా కదిలిస్తూ వచ్చారు.
బ్రేస్ వెల్ బ్రేస్ వెల్ 40 బంతుల్లో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
భారత బౌలర్ల లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా, జడేజా, షమీ లు చెరో వికెట్ తీశారు
ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్రధాన బౌలర్ హెన్రీ ఆడక పోవడం భారత్ కు కలిసి వచ్చే అంశం

