మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా, సోషియో ఫాంటసీ జానర్లో ‘విశ్వంభర'(Viswambhara) మూవీ రూపొందుతుంది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ తర్వాత మెగాస్టార్ (Chiranjeevi) నుంచి ఈ జానర్లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారికా ఈ చిత్రంలో నటించనున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా ‘విశ్వంభర’ సెట్స్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి ఆమెకి దుర్గ దేవి ప్రతిమ గల శంఖాన్ని చిరంజీవి (Chiranjeevi) బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొన్ని నెలల క్రితం వరకు వరుస ఫ్లాప్స్ చూసిన శ్రీలీల ‘పుష్ప 2’(Pushpa) లో చేసిన ‘కిస్సిక్’ సాంగ్‌తో మళ్ళీ ఫామ్ అందుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ మూవీ చేస్తోండగా.. ఇప్పుడు ఈమెని ‘విశ్వంభర’ కోసం తీసుకున్నారు. మరి శ్రీలీల ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోందా? లేదా ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోందా? అనే దాని మీదా క్లారిటీ రావాల్సివుంది. కాగా, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే, నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి. కాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే మూవీని ఏప్రిల్, మేలో విడుదల చేయాలని మేకర్స్ భావించినా ఈ మూవీ మరికొన్ని రోజులు వాయిదా పడేలా కనిపిస్తుంది. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే కానుకగా మూవీ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.

