‘స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్’ అంటోన్న రేవంత్ రెడ్డి

by | Mar 9, 2025 | రాజకీయాలు

ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించి మన దేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు.  ఈ ముగ్గురిలో యంగెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి (55 ఇయర్స్).  రాజ్ దీప్ సర్దేశాయ్ రేవంత్ రెడ్డి రైజింగ్ స్టార్ అఫ్ ది పార్టీ అని అన్నారు

రాజదీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ ఏదైనా ఒక సిటీ ని అభివృద్ధి చేయాలంటే నిధులు, పెట్టుబడులు కావాలి. కానీ తెలంగాణ రాష్ట్ర  బడ్జెట్ చూస్తే 3. 75 లక్షల కోట్ల అప్పు ఉంది.

అంతే కాకుండా మీరు  నిరుద్యోగ యువతకు  4 వేల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేశారు.  ఇటువంటి సమయంలో మీరు ఎలా ఫ్యూచర్ సిటీ ని నిర్మిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారు అని అడిగిన ప్రశ్నకు, రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ మీరందరు కెసిఆర్ తెలంగాణపై కెసిఆర్ వేసిన ముద్ర అది. మీరు అదే అనుకుంటున్నారు. కానీ  తెలంగాణ కు ఉన్న అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు

కెసిఆర్ వచ్చాక ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పు చేసింది.  గారంటీలకు మళ్ళీ అప్పు చేయాల్సి వస్తోంది. మరి రేస్ లో నిలబడాలంటే తప్పదు. ‘స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్’ అనే స్లోగన్ ఉంది కదా. 

అభివృద్ధి సాధించడం, సంక్షేమ పధకాలు అమలు చేయడం కష్టంగానే ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  అప్పులు, వాటి మీద వడ్డీలు చెల్లించలేకపోతున్నాం. హామీలు ఇచ్చాం కానీ అధికారంలో వచ్చాక గాని పరిస్థితి తెలియలేదు అన్నట్లుగా అన్నారు.

తెలంగాణ రాష్ట్ర నెలసరి ఆదాయం 18 వేల కోట్లు.  తిన్నా, తినకపోయినా 13 వేల కోట్లు 10 వ తారీఖు లోపల చెల్లించాలి.  సంక్షేమ పధకాలు అమలు చేసిన, అభివృద్ధి చేసిన ఈ ఐదు వేల కోట్లలోనే చేయాలిసిన పరిస్థితి.

గ్యారంటీల బిజినెస్ కు గ్యారంటీ లేదు అన్న ప్రశ్నకు,  ఢిల్లీ ఎన్నికలలో మోడీ (Narendra Modi) ఇచ్చిన గ్యారంటీల మీద ఎవరు ప్రశ్నించలేదు. ఇదేదో నా ఒక్కడికి సంబంధించినది కాదు. వన్ నేషన్. వన్ ఎలక్షన్, డిలిమిటేషన్ కన్నా ముందు  దీని మీద నేషనల్ డిబేట్ జరగాలి. Capital Expenditure మీద ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను. ఇలాగే కొనసాగితే  రాష్ట్రం ఏమైపోతుంది. దేశం ఏమైపోతుంది.  అని ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు