ప్లాప్ లు ఇవ్వని డైరెక్టర్ లు ఎవరో తెలుసా – నెంబర్ 2

by | Mar 8, 2025 | సినిమా

ప్లాప్ లు ఇవ్వని డైరెక్టర్ ల లో నెంబర్ వన్ మన రాజమౌళి. అయితే రాజమౌళి కాకుండా, దక్షిణాదిలో ఇప్పటివరకు ఒక్క ప్లాప్ ఇవ్వని దర్శకులు ఇంకా ఉన్నారు

వారిలో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు.

మొదటి సినిమా ఉగ్రం. 2014 లో విడుదలైన కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత బాగా టైం తీసుకుని,  యష్ తో కె జి ఎఫ్ ఫ్రాంచైజ్ తీశారు. రెండు బ్లాక్ బస్టర్ హిట్స్.   కె జి ఎఫ్-2, అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన కన్నడ చిత్రం గా రికార్డు సృష్టించింది.

రెండు పాన్ ఇండియా సూపర్ హిట్స్ తో, మన డార్లింగ్ ప్రభాస్ తో తీసిన సలార్ తో తెలుగు లో కూడా అడుగు పెట్టాడు.  కన్నడ లో తీసిన మొదటి సినిమా ఉగ్రం మాత్రమే రీజినల్ ఫిలిం.  ఆ తరవాత తీసిన మూడు పాన్ ఇండియా చిత్రాలే. ఇప్పుడు తీయబోయే సలార్ 2, ఎన్టీఆర్ తో తీయబోయే డ్రాగన్ చిత్రాలు కూడా పాన్ ఇండియా చిత్రాలే 

ప్రశాంత్ నీల్ సినిమాలు ఒక కొత్త ఒరవడి ని సృష్టించాయి. అప్పటి దాక తీస్తున్న సినిమాలు ఒక ఎత్తు.  ప్రశాంత్ నీల్ సినిమాలు ఒక ఎత్తు.  డార్క్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమాలు తీస్తూ ఒక కొత్త స్టైల్ అఫ్ సినిమా మేకింగ్ ని ఆడియన్స్ కి పరిచయం చేశాడు