మెగా స్టార్ చిరంజీవి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

by | Mar 8, 2025 | ప్రగడ టీవీ

మహిళా దినోత్సవం సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు. నా నిజ జీవితాన్ని, సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎట్టి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారు. మెగా స్టార్ చిరంజీవి షేర్ చేసిన ఈ పిక్ లో చిరంజీవి భార్య సురేఖతో పాటు కధానాయికలు ఖుష్బూ, నదియా, రాధిక,సుహాసిని, మీనా,జయ సుధ, టాబు ఉన్నారు

ఇక ఉమెన్స్ డే సందర్భంగా మెగా స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి తల్లి అంజనమ్మ తన పిల్లలు చిరంజీవి, నాగబాబు, విజయ దుర్గలతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేయ‌గా, ఈ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ ఈరోజు విడుదల అయింది. అయితే ఈ ఇంటర్వ్యూలో అందరూ తమ తల్లి అంజనమ్మతో చిన్నప్పుడు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అలాగే వారి జీవితంలో తమ తల్లి ఎంతలా  సపోర్ట్ చేశారో వివరించారు