మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యువ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమాను వేసవి కానుకగా మేలో విడుదల చేయాలని భావించారు మేకర్స్. కానీ ఫైనల్ అవుట్ పుట్ తో సంతృప్తి చెందని చిత్ర యూనిట్ మరికొన్ని రోజులు సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం విశ్వంభర (Viswambhara) సినిమాను ఆగస్ట్ 22న చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వాయిదాకు వీఎఫ్‌ఎక్స్ తో పాటుగా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా చెబుతున్నారు. కాగా, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి అందించబోతున్న మ్యూజిక్ సినిమాకే హైలెట్‌గా నిలవబోతుందని అంటున్నారు.
ఇక ‘విశ్వంభర’ (Viswambhara) సినిమాలో త్రిష (Trisha) కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర చిరంజీవి(Chiranjeevi) పాత్రకు ధీటుగా ఉంటుందట. ఇందులో బలమైన కథానాయికగా త్రిష కనిపిస్తారని సమాచారం. కాగా, ఈ మూవీలో మెగా వారసులు నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నటుడు సాయధరమ్ తేజ్‌తో పాటు మెగా డాటర్ నిహారికా కొణిదెలా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ షూటింగ్‌లో కూడా పాల్గోన్నాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో అషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, కునాల్ కపూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

