ఆసక్తికరంగా నాని ‘కోర్ట్’ ట్రైలర్

by | Mar 7, 2025 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలో వాల్ పోస్టర్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కోర్ట్'(Court). స్టేట్ వ‌ర్సెస్ ఏ నోబ‌డీ అనేది ఉప‌శీర్షిక‌. ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్ర‌శాంతి త్రిపిరినేని నిర్మిస్తుంది. పొక్సో చట్టం నేపథ్యంలో సందేశాత్మకంగా ఉంటుందని, ఈ సినిమా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో ముస్తాబైన ఈ సినిమా మార్చి 14న విడుదల కానుండగా, తాజాగా ట్రైలర్ (Trailer) రిలీజ్ చేశారు మేకర్స్.

ఆధ్యంతం ఆసక్తిగా సాగిన ఈ ట్రైలర్ ను పరిశీలిస్తే.. తన కూతురితో ప్రేమించడానే కోపంతో తండ్రి (శివాజీ) ఓ యువకుడి మీద పోక్సో కేసు పెడతాడు. పోక్సో లాంటి కేసు కావడంతో ఏ న్యాయవాది కేసు వాదించేందుకు ఒప్పుకోరు. అలాంటి సమయంలో ప్రియదర్శి (Priyadarsi) ఈ కేసు వాదించేందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది అనేదే సినిమాగా తెలుస్తోంది. కాగా, శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందిస్తున్నారు.