ఇప్పటివరకు కనీసం ఒక్క ప్లాప్ సినిమా కూడా లేని దర్శకులు ఎవరెవరు ఉన్నారో తెలుసా. వీరిలో అగ్రగణ్యుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటివరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఒక్క ప్లాప్ సినిమా కూడా లేదు. ఈ సినిమాలలో బాహుబలి 1 & 2, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ లు. ఆర్ ఆర్ ఆర్ తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ప్రస్తుతం మహేష్ బాబు అంతర్జాతీయ స్థాయిలో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నారు
రాజమౌళి ఇప్పటిదాకా దర్శకత్వం వహించిన సినిమాలు ఏంటో చూద్దాం
రాజమౌళి మొదటి సినిమా 2001 లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 మ్యూజికల్ హిట్ అయ్యింది
రెండవ సినిమా కూడా తారక్ తోనే 2023 లో సింహాద్రి తీశారు. రాజమౌళి సింహాద్రి ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు
మూడవ సినిమా 2004 లో సై. ఇందులో నితిన్ హీరో
నాలుగవ సినిమా 2005 లో ప్రభాస్ (Prbhas) తో తీసిన ఛత్రపతి. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది
ఐదవ సినిమా 2006 లో రవి తేజ తో తీసిన విక్రమార్కుడు. బ్లాక్ బస్టర్ హిట్
ఆరవ సినిమా 2007 లో మళ్ళీ తారక్ (NTR) తో తీసిన యమదొంగ.
ఏడవ సినిమా 2009 లో రామ్ చరణ్ (Ram Charan) తో తీసిన మగధీర. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఎనిమిదవ సినిమా 2010 లో కమెడియన్ సునీల్ తో తీసిన మర్యాద రామన్న
తొమ్మిదవ సినిమా 2012 లో ఒక ఈగ తో తీసిన అద్భుతమైన సినిమా ‘ఈగ’
10 వ సినిమా 2015 లో వచ్చిన మొదటి తెలుగు పాన్ ఇండియా సినిమా బాహుబలి.-1. (Bahubali)
11 వ సినిమా 2017 లో వచ్చిన రెండవ పాన్ ఇండియా సినిమా బాహుబలి -2. ప్రభాస్ కు పాన్ ఇండియా హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం
12 వ సినిమా 2022 లో మళ్ళీ తారక్, రామ్ చరణ్ తీసిన మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా రాజమౌళికి, తారక్ కు, రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయి ఇమేజ్ తెచిపెట్టింది. అంతే కాదు ఇందులోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది
రాజమౌళి తారక్ తో 4 సినిమాలు, ప్రభాస్ తో 3 సినిమాలు, రామ్ చరణ్ తో 2 సినిమాలు చేశారు
ఇప్పటివరకు ప్లాప్ సినిమాలే చేయని మరో దర్శకుడి గురించి మరో ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ లోగా నెక్స్ట్ ఎవరో గెస్ చేయండి

