విడుదల తేది: 07–03–2025
నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, దివ్యభారతితో పాటు చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
ఛాయాగ్రహణం: గోకుల్ బెనోయ్
కూర్పు: శాన్ లోకేష్
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
ఎడిటింగ్: ప్రసన్న జీకే
నిర్మాత: జీవీ ప్రకాశ్ కుమార్, ఉమేష్ బన్సల్
దర్శకత్వం: కమల్ ప్రకాష్
తమిళ సంగీత దర్శకుడు, ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్‌స్టన్’ . ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తుండగా.. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ (ZEE Studios) & ప్యారాలల్ యూనివర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ (G V Prakash Kumar) సంగీతం అందించారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ తోనే భారీ అంచనాలు నెలకొల్పగా.. ఈ సినిమా మార్చి 07న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..
జీవీ ప్రకాశ్ కుమార్ ఎలా మెప్పించారు? గత చిత్రాల తరహాలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారా లేదా వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం…
కథ:
తమిళనాడు తీరప్రాంతంలో 1982లో ఈ సినిమా కథ జరుగుతుంది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఆ గ్రామ ప్రజలు శవాలుగా తిరిగి వస్తుంటారు. ఆగ్రామంలో బోసయ్య(అజగన్ పెరుమాళ్) అనే వ్యక్తిని ఊరంతా కలిసి చంపేసి పాతి పెడతారు. అది ఆత్మ అయి గ్రామస్థులను భయం పెడుతుండటంతో ఆ శవాన్ని సముద్రంలో పడేస్తారు. ఆనాటి నుంచే ఎవరూ ఆ ప్రదేశానికి వెళ్లొద్దు అని అనుకుంటారు. కానీ కింగ్‌స్టన్(జి.వి. ప్రకాష్ కుమార్)తో పాటుగా అతని స్నేహితులు థామస్(సాబుమాన్ అబ్దుసమద్) దగ్గర థామస్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. దాని వల్ల ఒక యువకుడు చనిపోతాడు. దాంతో థామస్ ను ఎదిరించి ఆ ముఠా నుంచి బయటకు వస్తాడు కింగ్‌స్టన్. ఈ క్రమంలో పొట్టకూటి కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అందరూ వద్దని చెబుతున్నా వినకుండా స్నేహితులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్తాడు కింగ్‌స్టన్. అతని గర్ల్ ఫ్రెండ్ రోజ్(దివ్య భారతి)కూడా వాళ్ళ షిప్‌లో వెళ్తుంది. మరి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళాక ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ? అక్కడ దెయ్యాలు వీరికి కనించాయా ? అసలు సముద్రంలోకి వెళ్లిన వాళ్లంతా ఎందుకు చనిపోతున్నారు? అనేది థియేటర్లలో చూడాల్సిందే.
విశ్లేషణ:
జీవీ ప్రకాష్ ఈ సినిమాకు హీరోగానే కాకుండా సంగీత దర్శకుడి, నిర్మాతగా మూడు పాత్రలకు న్యాయం చేసాడు.
నటనలో మంచి వేరియేషన్స్ చూపించాడు. దివ్యభారతి ఈ సినిమాలో తన నటనతో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. బోసయ్య పాత్రలో అజగన్ పెరుమాళ్ అలరించారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంటుంది. దర్శకుడు కమల్ ప్రకాష్ తన మొదటి సినిమాకి కొంచెం విభిన్నంగా చేయాలి అనుకున్నాడు. కానీ అది విజయవంతం కాలేదు. ప్రేక్షకులకు థ్రిల్ అందించే కంటెంట్ ఈ కథలో వుంది. కానీ దాన్ని తెరపై చూపించడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. హీరో సముద్రంలో వేటకు వెళ్లే దగ్గర నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా సముద్రంలోని సీన్స్ బాగున్నాయి. జీవి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డబ్బింగ్ వెర్షన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
కథా నేపథ్యం
విరామ సన్నివేశాలు
జీవీ ప్రకాష్ నటన
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు
భావోద్వేగాలు పండించకపోవడం
కొరవడిన సహజత్వం
రేటింగ్: 2.5/5

