MLC గా నామినేషన్ దాఖలు చేసిన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు
జనసేన ప్రధాన కార్యదర్శి, జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోదరుడు అయిన నాగబాబు గారు ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు
ఈ కార్యక్రమంలోమంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గారు, ఏం ఎల్ ఏ లు బొలిశెట్టి శ్రీనివాస్, కొణతాల లు పాల్గొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీమతి వనిత రానికి నాగబాబు (Nagababu) నామినేషన్ పత్రాలు సమర్పించారు
అంతకు ముందు, మొదట రాజ్య సభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబు ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు భావించారు. ఆ తరవాత , శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు, కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గారు ఖరారు చేశారు.
ఇప్పుడు మరి మంత్రి వర్గంలోకి తీసుకుంటారా, తీసుకుంటే ఏ శాఖ అప్పగిస్తారు అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది
నాగబాబు (Nagababu) చురుకుగా జనసేన పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు. ఏ పదవి ఆశించకుండా, పార్టీ కోసం కష్టపడ్డారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు
మార్చ్ 14 న, జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను పిఠాపురం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా, నాగ బాబు(Nagababu) , పవన్ కళ్యాణ్ స్పీచ్ లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

