WPL : యూపీ వారియర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

by | Mar 6, 2025 | సినిమా

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. యూపీ వారియర్స్ ఓపెనర్లు గ్రేస్ హారిస్, జార్జియా వోల్ లు మొదటి వికెట్ కు 74 పరుగులు జోడించారు.  మొదటి వికెట్ కోల్పోయిన తరవాత అప్ వారియర్స్ క్రమం తప్పకుండ వికెట్లు కోల్పోతూ వచ్చింది

ఓపెనర్ జార్జియా వోల్ 33 బంతుల్లో 55 పరుగులు చేసి మ్యాచ్ టాప్ స్కోరర్ గా నిలిచింది. గ్రేస్ హరీష్ 28 పరుగులు, కెప్టెన్ దీప్తి శర్మ 27 పరుగులు చేశారు

ముంబై ఇండియన్స్ బౌలర్ల లో అమీలియా కెర్ 5 వికెట్లు తీసుకుంది. మాధ్యుస్ రెండు వికెట్లు, సిసోడియా, బ్రన్ట్ చెరో ఒక వికెట్ తీశారు

అనంతరం 151 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే కెర్ వికెట్ ను కోల్పోయినప్పటికీ మరో ఓపెనర్ మాధ్యుస్,  బ్రన్ట్ లు రెండవ వికెట్ కు 92 పరుగులు జోడించి ముంబై ఇండియన్స్ ను పటిష్ట స్థితికి చేర్చారు 

37 పరుగులు చేసిన బ్రన్ట్ అవుట్ అయిన వెంటనే, ఓపెనర్ మాధ్యుస్ కూడా 68 పరుగులు చేసి అవుట్ అయ్యింది.  ఆ తరవాత వచ్చిన కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ కూడా 4 పరుగులకే అవుట్ అయ్యింది.  అయితే అప్పటికే ముంబై ఇండియన్స్ విజయం ఖరారు అయ్యింది.

అమన్ జ్యోత్ కౌర్, యాస్తికా భాటియా లు లాంఛనాన్ని పూర్తి చేశారు. అమన్ జ్యోత్ కౌర్ 12 పరుగులు , యాస్తికా భాటియా 10 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.  ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి విజయాన్ని సాధించింది 

యూపీ వారియర్స్ బౌలర్ల లో హారిస్ రెండు వికెట్లు తీయగా, గౌడ్, హెన్రీ చెరో ఒక వికెట్ తీశారు