జగన్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్

by | Mar 5, 2025 | వార్తలు

ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ,పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై చేసిన వ్యాఖ్యలు నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు.

ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ (Jagan Mohan Reddy) తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ ప్రెస్ మీట్ అంతా  చంద్రబాబు (Chandrababu Naidu) ని ఏదో ఒక రకంగా కామెంట్ చేస్తూనే ఉన్నాడు. అంతే కాకుండా ఒకే విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైనా రిగ్గిం చేస్తారా అని అన్నారు.

మెజారిటీ సీట్ లు రానప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ ఇప్పటికి మొర  పెట్టుకుంటున్నాడు. అయితే రూల్ బుక్ ప్రకారం ప్రతి పక్ష హోదా ఇచ్చేది లేదని కూటమి ప్రభుత్వం తెగేసి చెప్తోంది

జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళాలి అని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి ఒక విలేఖరి ప్రశ్నించగా జగన్ మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఏం ఎల్ ఏ కు తక్కువ అని అన్నారు

జగన్ చేసిన కామెంట్ల కు ఈ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన జనసేన నేత, మంత్రి  నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గారు జగన్ కు కౌంటర్ గట్టిగానే ఇచ్చారు.  జగన్ ది క్రిమినల్ మైండ్ అని అన్నారు. మేము కూడా అనచ్చు కదా జగన్ నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని జగన్ మోహన్ రెడ్డి కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.  ఏవిధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికి తెలుసు కదా. ఇది పద్ధతా అని అన్నారు

అంతే కాకుండా జగన్ మోహన్ రెడ్డి వర్క్ ఫ్రమ్ బెంగుళూరు ఏం ఎల్ ఎ అని అన్నారు. సాధారణం గా అసెంబ్లీ అయిపోయాక, శాసన సభ్యులు వాళ్ళ నియోజకవర్గానికి వెళ్లి పని చేసుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈయన (జగన్ మోహన్ రెడ్డి) శాసన సభ కు రారు.  బెంగుళూరు కు మాత్రం తరచూ వెళుతుంటారు. ఏవిధంగా మీరు ప్రజా సమస్యలపై మీరు నిలబడతారు చెప్పండి. ప్రజలు మిమ్మల్ని ఒక శాసన సభ్యుడిగా ఎన్నుకున్నారు కదా, దానిని మీరు గౌరవించాలి కదా అని అన్నారు

ఇవన్నీ వదిలేసి, కేవలం ప్రెస్ మీట్ లు పెట్టి పవన్ కల్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ది క్రిమినల్ మైండ్, ఈ విధంగా ప్రస్థానంలో ముందుకు వెళతాడు

ప్రజాస్వామ్యం లో ఒక పద్దతి  ప్రకారం మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.    అవతలి వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడడం వల్ల,  మీకు ఓట్లు పడిపోతాయి అనుకుంటే మాత్రం , నిన్నటి ఎన్నికలే దానికి నిదర్శనం.

ఏం ఎల్ సి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

అంతకు ముందు ఎన్నికలలో వైస్సార్సీపీ ఘోరంగా ఓడిపోయింది.  2019 లో 151 సీట్లు గెలుచుకున్న వైస్సార్సీపీ 2024 ఎన్నికల్లో కేవలం  11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.