‘ఆర్‌సీ16’ శివన్న లుక్ టెస్ట్ పూర్తి.. పార్లమెంట్‌లో చరణ్ ఎంట్రీ!

by | Mar 5, 2025 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) , ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా..
క‌న్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న శివరాజ్‌కుమార్ (Shivaraj Kumar) లుక్ టెస్ట్ పూర్తయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. ఈ క్రమంలోనే స్పెషల్ వీడియో అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో శివరాజ్‌కుమార్ లుక్ టెస్ట్ పూర్తయిందని, అదిరిపోయే లుక్స్ ఫిక్స్ చేశామని, త్వరలోనే ఆయన సెట్స్ లో అడుగుపెడతారని వెల్లడించింది. కాగా, ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర ముఖ్య నటులపై కుస్తీ బ్యాగ్డ్రాప్ సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటుగా ఢిల్లీలోని పార్లమెంట్‌లో మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారుల అనుమ‌తుల కోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. ఈ అనుమ‌తి రాగానే పార్లమెంట్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అలాగే ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతంలోనూ ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. కానీ రంజాన్ మాసం కారణంగా ఆ షెడ్యూల్ మార్చి ఆఖరి వారం వరకు వాయిదా పడే అవకాశం ఉంది.

ఇక ఢిల్లీ షెడ్యూల్ ముగిశాక దానికి కొనసాగింపుగా కొన్ని కీలక సన్నివేశాలను కాకినాడ‌లో కూడా చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. కాగా, మార్చి 27న రామ్‌చరణ్‌ (Ram Charan) బర్త్ డే కానుకగా టైటిల్‌, టీజర్‌ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.