ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ అన్న అయిన నాగబాబు ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు
మొదట రాజ్య సభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబు(Nagababu) ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు భావించారు. శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన (Janasena) అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గారు ఖరారు చేశారు.
ఇప్పుడు మరి మంత్రి వర్గంలోకి తీసుకుంటారా, తీసుకుంటే ఏ శాఖ అప్పగిస్తారు అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది
ప్రస్తుతం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు (Nagababu) గారు సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని శ్రీ నాగబాబు గారికి సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు ఆదేశించారు.
నాగబాబు చురుకుగా జనసేన పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు. ఏ పదవి ఆశించకుండా, పార్టీ కోసం కష్టపడ్డారు. అయినా సరే తమ్ముడు మాటే శిలాశాశనం అని పదవి రాకపోయినా పాజిటివ్ స్పిరిట్ తో పార్టీ కోసం శ్రమిస్తున్న మా శ్రమ నాయకుడు నాగబాబు గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసినందుకు శుభాకాంక్షలు

