ఓటీటీలోకి ‘లైలా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

by | Mar 5, 2025 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో మాస్​ కా దాస్ విశ్వక్‌ సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన తాజా సినిమా ‘లైలా’. ద‌ర్శ‌కుడు రామ్ నారాయ‌ణ్ రూపొందించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గార్ల‌పాటి నిర్మించారు. ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్ మూవీగా లైలా నిలిచిపోయింది. ఇండస్ట్రీలో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా ఉన్న విశ్వక్ సేన్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. నిజానికి ‘లైలా’ సినిమాను రిలీజ్ కు ముందే కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని ఓ వర్గం పిలుపునిచ్చింది. దీనిపై విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలోనే సినిమా ఫలితంపై విశ్వక్‌ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే

ఈ నేపథ్యంలోనే తాజాగా అలాంటి లైలా సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను రిలీజ్ చేసింది. మార్చి 7నుంచి ఆహా ఓటీటీలో లైలా మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా, లైలా సినిమాతో భారీ
ప్లాప్ అందుకున్న విశ్వక్ సేన్ తన తర్వాతి సినిమాను జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా విశ్వక్ ఫామ్ లోకి వస్తాడేమో అన్నది చూడాలి.