టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్డమ్’. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.
ఇక విజయ్ దేవరకొండ తన తర్వాతి చిత్రాన్ని రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గురించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మాస్ కథతో రాబోతుందని తెలుస్తుండగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు ఈ సినిమా టైటిల్ ‘రౌడీ జనార్ధన’ అని ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. లార్జర్ దేన్ లైఫ్ అన్నట్లు రూరల్ యాక్షన్ డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. అలాగే ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని, రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలు కానుందని వెల్లడించారు.

