పాక్ టి 20 జట్టు నుండి రిజ్వాన్, బాబర్ అవుట్

by | Mar 4, 2025 | వార్తలు

ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో సొంత గడ్డపై పేలవ ప్రదర్శన చేసి లీగ్ స్టేజి లోనే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నిష్క్రమించింది పాకిస్థాన్.  ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది.

సీనియర్ ఆటగాళ్లు అయినా బాబర్ అజాం, రిజ్వాన్ లను టి 20 జట్టు నుండి తప్పించింది.  ఛాంపియన్స్ ట్రోఫీ లో పాక్ ఓటమికి వీరిద్దరూ ఒక కారణం అని చెప్పవచ్చు. బంతులను వృధా చేసి కీలక సమయం లో అవుట్ అయ్యారు

మార్చ్ 16 నుండి పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టి 20 మ్యాచ్ లు, 3 వన్ డే మ్యాచ్ లు జరగనున్నాయి

సెప్టెంబర్ లో ఆసియ కప్, 2026 లో టి 20 వరల్డ్ కప్ లు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుండి జట్టు కూర్పు పై దృష్టి పెట్టింది.  టి 20 జట్టు నుండి రిజ్వాన్, బాబర్ అజమ్ లను తప్పించిన పాక్ బోర్డు, వన్ డే జట్టులో  స్థానం కల్పించింది. 

పాక్ టి 20 జట్టుకు సల్మాన్ అఘా ను కెప్టెన్ గా నియమించారు. వైస్ కెప్టెన్ గా షాదాబ్ ఖాన్ ను నియమించారు

పాక్ వన్ డే జట్టుకు కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ ని కొనసాగించారు. వైస్ కెప్టెన్ గా సల్మాన్ అఘాని నియమించారు 

టి 20 జట్టు కు కెప్టెన్ గా ఉన్న సల్మాన్ అఘా ను వన్ డే జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమించారు