ఛాంపియన్స్ ట్రోఫీ SF : భారత విజయ లక్ష్యం 265 పరుగులు

by | Mar 4, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  ఆస్ట్రేలియా జట్టు .49.3 ఓవర్ల లో 264 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదట్లో నత్త నడకలా సాగింది.  ఓపెనర్ కూపర్ కొన్నోల్లీ 9 బంతులాడి పరుగులేమి చేయకుండా డక్ అవుట్ అయి వెనుతిరిగాడు. ట్రావిస్ హెడ్ లాంటి బ్యాట్స్ మన్  11 పరుగులు ఆడి ఒక్క పరుగు చేశాడంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

అయితే ట్రావిస్ హెడ్ నెమ్మదిగా బ్యాట్ ఝుళిపించడం మొదలు పెట్టాడు.  33 బంతుల్లో 39 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు.  లబుషేన్ 29 పరుగులు, జోష్ ఇంగ్లిస్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

స్లో పిచ్ ల మీద ఎలా ఆడాలో బాగా తెలిసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో ఫుల్ టాస్ బాల్ కు అవుట్ అయ్యాడు.  ఆ తరవాత వచ్చిన మాక్స్ వెల్ రాగానే సిక్సర్ కొట్టి ఆ తరవాత బంతికే అవుట్ అయ్యాడు.

స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ వికెట్ల ను వెంట వెంటనే కోల్పోయిన  ఆస్ట్రేలియా 37. 3 ఓవర్ల లో 205 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది.  ఒక వైపు వికెట్లు పడుతున్న, మరో పక్క అలెక్స్ క్యారి నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు ను కదిలించాడు.  అలెక్స్ క్యారి 57 బంతుల్లో 61 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు

మొదటి వికెట్ తొందరగా కోల్పోయినా, స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ వికెట్లు వెంట వెంటనే కోల్పోయినా,  ఆస్ట్రేలియా చిన్న, చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ స్కోర్ బోర్డు ను కదిలించింది.

భారత జట్టు బౌలర్ల లో షమీ మూడు వికెట్ లు తీయగా,  వరుణ్ చక్రవర్తి, జడేజా లు రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ కీలకమైన మాక్స్ వెల్ వికెట్ తీశాడు.  ఆఖరి వికెట్ ను హార్దిక్ పాండ్య తీశాడు