WPL : యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ ఘన విజయం

by | Mar 3, 2025 | వార్తలు

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ చేసింది

ఓపెనర్ బెత్ మూని 59 బంతుల్లో 17 ఫోరుల సహాయంతో 96 పరుగులు చేసింది.  గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ లో బెత్ మూని అయితే హైలైట్.  హర్లీన్ డియోల్ 32 బంతుల్లో 45 పరుగులు చేసి బెత్ మూని కి చక్కని సహకారం అందించింది.  వీరిద్దరూ కలిసి రెండవ వికెట్ కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  కెప్టెన్ గార్డనర్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యింది

యూపీ వారియర్స్ బౌలర్ల లో సోఫీ రెండు వికెట్లు తీయగా, హెన్రీ, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ లు తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం 187 పరుగుల భారీ స్కోర్ చేధించడానికి ఇన్నింగ్స్ ఆరంభించిన యూపీ వారియర్స్ తడబాటుకు గగురయ్యింది.  ఓపెనర్ కిరణ్ నావిగెరె, వన్ డౌన్ లో వచ్చిన జార్జియా వోల్ లు డక్ అవుట్ అయ్యారు.  ఆ తరవాత వచ్చిన దినేష్ వృందా(1), కెప్టెన్ దీప్తి శర్మ (6), సెహ్రావత్ (5)  కూడా తక్కువ పరుగులు చేసి అవుట్ అయ్యారు

హెన్రీ కాసేపు బ్యాట్ ఝుళిపించి 14 బంతుల్లో 28 పరుగులు చేసింది.

గుజరాత్ బౌలర్ల లో కాశ్వీ గౌతమ్, తనూజ కన్వర్ మూడేసి వికెట్లు తీయగా, డాటిన్ రెండు వికెట్లు తీసింది.  మేఘన సింగ్, గార్డనర్ చెరో ఒక వికెట్ తీశారు

ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయ్యింది.  మిగిలిన  రెండు జట్ల గురించి ఇంకా తేలాల్సి ఉంది