C Trophy : ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం

by | Mar 3, 2025 | వార్తలు

2023 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం రెండేళ్ల తరవాత ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ లో వచ్చింది 

2023 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా, భారత్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ట్రావిస్ హెడ్ విరుచుకుపడి 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు.  ప్రపంచ కప్ ఆసాంతం అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ సైతం వరల్డ్ కప్ ఫైనల్ లో తేలిపోయాడు

ఇన్నాళ్లకు భారత జట్టు, ఆస్ట్రేలియా తో ఐసీసీ ఈవెంట్ లో డీ కొట్టబోతోంది.  అప్పటితో పోలిస్తే ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు అంత గొప్పగా ఏమి లేదు. అయితే లీగ్ స్టేజి లో 351 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ పై చేధించింది. అయితే ఇంగ్లాండ్ బౌలింగ్ ఏమంత గొప్పగా లేదు.  ఆఫ్ఘనిస్తాన్ 317 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ బౌలర్ల పై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ చేధించారు.

ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ స్టేజి లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి.

అయితే ఆస్ట్రేలియా ను తక్కువ అంచనా వేయకూడదు.  క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు.  మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ మన వాళ్లకు కలిసి వచ్చే అంశం
ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ని క్రీజ్ లో కుదురుకోనివ్వకూడదు.  కుదురుకుంటే వాళ్ళని ఆపడం కష్టం. అయితే ఆస్ట్రేలియా బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇంగ్లాండ్ అంత పేలవంగా అయితే లేదు.  టాస్ గెలిస్తే ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది

రేపటి మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడా.  దుబాయ్ పిచ్ లన్ని స్పిన్ కు, స్లో బౌలర్ లకు అనుకూలంగా ఉన్నాయి. మన జట్టులో 5 గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నర్యు.  ఆస్ట్రేలియా కు జంపా ఒక్కడే ఉన్నాడు. ఈ అంశం భారత్ కు లభించే అంశం