హైదరాబాద్ లో జరిగిన సీనియర్ నటి కృష్ణవేణి సంస్మరణ సభ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు. అది ఒక కళాత్మక సందేశం. సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్నీ తెలియచేయడం.
స్మగ్లర్లను, దేశ ద్రోహులను హీరోలుగా చూపించకూడదు. అది హీరోఇజం అనిపించుకోదు. ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలను హీరోలు గా చూపిస్తున్నారని, అది చాల తప్పని, అలాంటి ఆదర్శాలను పిల్లల ముందు పెట్టకూడదు అని అన్నారు. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుంటి ఈ మాట చెప్పడం లేదు అని వెంకయ్య నాయుడు అన్నారు.
జుగుప్సాకరమైన, అస్లీలకరమైన పదజాలం కానీ, సన్నివేశాలు కానీ సినిమాలలో ఉండకూడదు. అలాంటి పద్ధతిని అందరు పాటించే ప్రయత్నం చేయాలి. ద్వందార్ధాలు ఉండే సంభాషణలు లేకుండా చూసుకోవాలి. అవి లేకున్నా సినిమా విజయవంతమవుతుందని మనవి చేస్తున్ననాని అన్నారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు గార్లను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అన్నారు
నటిగా, గాయనిగా, నిర్మాతగా చేసిన కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని వక్తలు కొనియాడారు. మనదేశం తో నందమూరి తారకరామారావు గారిని పరిచేసింది, కీలు గుర్రం తో అక్కినేని నాగేశ్వర రావు గారికి స్టార్ స్టేటస్ ఇచ్చింది సీనియర్ నటి కృష్ణవేణి గారని ఈ సందర్భంగా అందరు గుర్తు చేసుకున్నారు

