నేచురల్ స్టార్ నాని(Nani) , దసరా మూవీ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise) . ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘ది పారడైజ్’ మూవీలో నాని సరికొత్త పాత్రలో మెస్మరైస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడంతో ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఏర్పడాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సోనాలి కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్నారు. సికింద్రాబాద్ బ్యాగ్డ్రాప్ లో జరిగే కథగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ‘ప్యారడైజ్’ వరల్డ్ ఎలా ఉండబోతుందనే చూపించేశారు. వీడియో మొత్తంలో ఆ కాకుల రిఫరెన్సులు గట్టిగాన ఉన్నాయి… ఇది కడుపు మండిన కాకుల కథ.. జమానా జమానా కెల్లి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పెంచి పోసిన ఓ జాతి కథ అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో నాని పాత్ర , డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

