‘దేవర-2’లో .. మరో బాలీవుడ్ స్టార్ హీరోని దించుతున్న కొరటాల!

by | Mar 3, 2025 | సినిమా

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ టైటిల్‌ పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. దేవర మొదటి భాగం గ‌తేడాది సెప్టెంబర్ ‌27న విడుదలై సూపర్ హిట్‌ టాక్ తెచ్చుకుంది. అలాగే బాక్సఫీస్ వద్ద కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూ.. రూ.500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించగా.. హిందీ స్టార్ హీరో​ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్​గా కనిపించారు. ఎన్టీఆర్ (NTR) ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్​గా నిలిచింది. ఇందులో ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమా మొదటి భాగం కంటే రెండో భాగం పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ చాలా సార్లు పేర్కొన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం దేవర రెండో భాగం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దర్శకుడు కొరటాల శివ, తన టీమ్‌ తో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కథను మరింత ఆసక్తికరంగా మలిచేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ఈ సినిమాలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్, రణ్ వీర్ సింగ్ మధ్య వచ్చే సీన్స్ రసవత్తరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్, రణ్ వీర్ సింగ్ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా బాక్సఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిమానూలు అంటున్నారు. కాగా, వచ్చే ఏడాది జనవరి నుంచి దేవర రెండో భాగం సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.