ఈ సారి సమ్మర్ లో కూడా డబ్బింగ్ సినిమాలదే హవా గా కనిపిస్తోంది. గత సమ్మర్ లాగే ఈ సారి కూడా తెలుగు సినిమాలు ఎక్కువగా కనిపించేలా లేవు
ఇటీవల శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారం గా బాలీవుడ్ లో వచ్చిన చావా బ్లాక్ బస్టర్ హిట్ అయినా విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల డిమాండ్ మేరకు, ఇప్పుడు చావా సినిమాను తెలుగు లో గీత ఫిలిమ్స్ వారు విడుదల చేయనున్నారు.
మార్చ్ 7 న చావా తెలుగు వెర్షన్ విడుదలవుతోంది. ఇక అదే మార్చ్ 7 న, జి వి ప్రకాష్ కుమార్ కింగ్ స్టన్, మలయాళ సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి
మార్చ్ 27 న మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ (లూసిఫర్ 2), విక్రమ్ నటించిన ‘వీర ధీర శూరన్ – పార్ట్ 2’ చిత్రాలు విడుదలవుతున్నాయి
మైత్రి మూవీ మేకర్స్ తమిళంలో నిర్మించిన మొదటి సినిమా గుడ్, బాడ్, అగ్లీ. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10 న విడుదలవబోతోంది. కంగువా సినిమా ఘోర పరాజయం తరవాత సూర్య నటిస్తోన్న చిత్రం రెట్రో. ఈ సినిమా మే 1 న విడుదల అవుతోంది
ఇక జూన్ నెల విలక్షణ నటుడు కమల్ హాసను కు బాగా కలిసొచ్చిన నెల. మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటించిన ‘ధగ్ లైఫ్’ సినిమా జూన్ 5 న విడుదలవబోతున్నాయి. గతం లో కమల్ హీరో గా నడిచిన విక్రమ్ కూడా జూన్ విడుదలై సూపర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే
ఇంకా మురుగుదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన మదరాసి సినిమా తో పాటు కార్తీ నటించిన వా వాతియార్ చిత్రం కూడా జూన్ నెలలో విడుదలవబోతున్నాయి
తెలుగు హీరోలు, దర్శకులు పండగ సీజన్లమీదే దృష్టి పెడుతున్నారు. వేసవి సెలవుల మీద దృష్టి పెట్టడంలేదు. మంచి కంటెంట్ ఉంటె, మండుటెండలను సైతం లెక్క చేయరు మన తెలుగు ప్రేక్షకులు. మోహన్ లాల్, విక్రమ్, కమల్ హాసన్(Kamal Hasan) , అజిత్ (Ajith) ,కార్తీ, శివ కార్తికేయన్, సూర్య (Surya) వంటి నటులు, ఈ వేసేవై సెలవుల్లో, తెలుగు మార్కెట్ ను టార్గెట్ చేశారు.
వరుసగా రెండో సారి వేసవి సెలవులను తెలుగు బడా స్టార్ట్ లు వదిలేశారు

