తెలుగు అగ్ర కథనాయకుడు విక్టరీ వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న రిలీజైన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. కాగా, ఈ సినిమా మార్చి 1న అటు టీవీలో, ఇటు ఓటీటీలో జీ5 వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ వేదికగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓ అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు జీ5లో కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూ మినిట్స్ వచ్చాయని జీ5 అధికారికంగా ప్రకటించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇప్పటివరకు జీ5లో 13 లక్షలమందికి పైగా చూశారని జీ5 వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాల రికార్డులను అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్రేక్ చేసిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జీ5 ప్లాట్ఫామ్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక మరోవైపు జీ5లో ఈ మూవీ రన్‌టైమ్ విషయంలో మేకర్స్ వీక్షకులకుషాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిడివి 2 గంటల 24 నిమిషాలుగా ఉండగా.. ఓటీటీలో మాత్రం నిడివి తగ్గిపోయింది. జీ5లో కేవలం 2 గంటల 16 నిమిషాల నిడివితోనే సినిమాను అందుబాటులో ఉంచారు. జీ5లో మార్చి 1న రిలీజైన ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది

