టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్'(Thandel) . యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ క్రమంలోనే తండేల్ సినిమా ఇటీవలే 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల కలెక్షన్స్ సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. అయితే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎప్పుడొస్తుందా అని అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు తండేల్ టీమ్ శుభవార్త చెప్పింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మూవీ రిలీజైన సరిగ్గా నెల రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే మార్చి 7 శుక్రవారం నుంచి తండేల్ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవ్వగా… మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ సినిమాలో కరుణాకరన్, దివ్య పిళ్లై, జబర్దస్త్ మహేష్ కీలకపాత్రల్లో అలరించారు.

