‘ఫౌజీ’ మూవీ: ప్రభాస్‌తో పాటుగా మరో స్టార్ హీరో!

by | Mar 2, 2025 | సినిమా

టాలీవుడ్ లో వరుస సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫుల్ జోష్ మీదున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ అనే యంగ్​ బ్యూటీ నటిస్తోంది. ఇప్పటికైతే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 1940ల్లో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో సన్నీ డియోల్ (Sunnydeol) పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఇది స్క్రిప్ట్ లో చాలా ప్రాధాన్యమున్న పాత్ర అని, మునుపెన్నడూ లేని రీతిలో సన్నీ డియోల్ కొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం. అలాగే ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్‌ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నదట. కథ రీత్యా ఇందులో ఓ యువరాణి పాత్ర ఉంటుందట. ఆ పాత్రలో అలియా కనిపిస్తుందని ఇండస్ట్రీ టాక్‌. మరి ఈ విషయాలు ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, ‘ఫౌజీ’ సినిమాను చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న కథాంశంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది.