ఎన్టీఆర్-నీల్ మూవీకి రికార్డ్ బడ్జెట్.. పాన్ వరల్డ్ టార్గెట్‌గా!

by | Mar 2, 2025 | సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NTRNeel అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షూటింగ్ హైదరాబాద్ లో ఇప్పటికే మొదలైంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్ లేకుండా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తునట్లు తెలుస్తోంది. కాగా, మార్చి మూడో వారం నుంచి ఎన్టీఆర్ (NTR) ఈ మూవీ సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం.

కాగా, ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers), ఎన్టీఆర్‌ (NTR) ఆర్ట్స్‌ పై నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) , నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ బడ్జెట్ వివరాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం. పాన్ వరల్డ్ టార్గెట్ గా ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంతటి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటి వరకూ పోషించని పాత్రలో కనిపించబోతున్నాడని.. ఆయన పాత్రను ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రూపొందించిన తీరు నెవ్వర్ బిపోర్ అనేలా ఉండనుందని చిత్ర యూనిట్ పేర్కొంటున్నారు. కాగా, పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్‌ పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.