సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ పై, ఇండియా మాస్టర్స్ ఘన విజయం

by | Mar 1, 2025 | వార్తలు

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో  భాగంగా ఇండియా మాస్టర్స్, సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో  ఇండియా మాస్టర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా మాస్టర్స్, 13. 5 ఓవర్ల లో 85 పరుగులకే అల్ అవుట్ అయ్యింది.

సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ జట్టులో నలుగురు బ్యాట్స్ మన్ (కలిస్, రుడాల్ఫ్, ఫిలాండర్, కృగర్) డక్ అవుట్ అయ్యారు.

38 పరుగులు చేసిన ఓపెనర్ హెన్రీ డేవిడ్ సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ జట్టులో టాప్ స్కోరర్. డేన్ విలాస్ 21 పరుగులు చేశాడు.  వీరిద్దరే సౌత్ ఆఫ్రికా జట్టులో రెండంకెల స్కోర్ చేశారు.

ఇండియా మాస్టర్స్ జట్టులో రాహుల్ శర్మ, యువరాజ్ సింగ్ చెరో మూడు వికెట్ లు తీయగా,  నేగి, బిన్నీ చెరో రెండు వికెట్లు తీశారు

86 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా మాస్టర్స్ 6 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ వికెట్ ను కోల్పోయింది.  ఆ తరవాత వచ్చిన ఇర్ఫాన్ పఠాన్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

అంబటి రాయుడు, పవన్ నేగి లు జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా ఇండియా మాస్టర్స్ ను గెలిపించారు. అంబటి రాయుడు 41 పరుగులతో, పవన్ నేగి 21 పరుగులతో అజేయంగా నిలిచారు. 

సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ బౌలర్లలో లీ, తషాబాలాల చెరో ఒక వికెట్ తీశారు.

3 కీలక వికెట్లు తీసిన రాహుల్ శర్మ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు