సౌత్ ఆఫ్రికా ఘన విజయం ; పాయింట్ల పట్టిక లో మొదటి స్థానం

by | Mar 1, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా 7 వికెట్ ల తేడాతో ఘన విజయం సాధించింది

180 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా కు ఆరంభంలో షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్. ఓపెనర్ స్టబ్స్ డక్ అవుట్ అయ్యాడు.  కాసేపటికి 27 పరుగులు చేసిన మరో ఓపెనర్ రికెల్టన్  కూడా అవుట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లను ఆర్చర్ తీసుకున్నాడు

అయితే ఆ తరవాత వచ్చిన క్లాసెన్(Klassen) , వాండెర్ డుస్సేన్ లు మూడవ వికెట్ కు 127 పరుగుల  భాగస్వామ్యాన్ని నెలకొల్పారు  గెలవడానికి ఇంకా 6 పరుగులు కావాల్సిన తరుణంలో 64 పరుగులు చేసిన క్లాసెన్ రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన డేవిడ్ మిల్లర్ తో కలిసి వాండెర్ డుస్సేన్  లాంఛనాన్ని పూర్తి చేశాడు.  వాండెర్ డుస్సేన్ 72 పరుగులు, డేవిడ్ మిల్లర్ 7 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.  మిల్లర్ సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు.

మూడు కీలక వికెట్లు తీయడమే కాకుండా, రెండు క్యాచ్ లు పట్టిన మార్కో జన్సెన్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ (Player of the Match) అవార్డు లభించింది

సౌత్ ఆఫ్రికా 180 పరుగుల లక్ష్య చేధనను 29.1 ఓవర్ల లో పూర్తి చేసింది.   మొత్తం 100 ఓవర్ల లో ఇరు జట్లు కలిపి కేవలం 67.3 ఓవర్లు ఆడారు. అంటే 32.3 ఓవర్లు బౌల్ చేయకుండా మ్యాచ్ ముగిసిపోయింది  

ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా (South Africa) గ్రూప్ బి లో పాయింట్ ల పట్టికలో, 5 పాయింట్ల తో మొదటి స్థానంలో నిలిచింది.

అంతకు ముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 179 పరుగులకు చాప చుట్టేసింది

ఇప్పటిదాకా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్ (England) బ్యాటింగ్ లో కూడా ఘోరంగా విఫలమైంది.  ఎంతలా అంటే కేవలం 38.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు

37 పరుగులు చేసిన జో రూట్ ఇంగ్లాండ్ జట్టు లో టాప్ స్కోరర్.  ఆర్చర్ 25 పరుగులు, డకెట్ 24 పరుగులు, కెప్టెన్ బట్లర్ 21 పరుగులు చేశారు.  స్పిన్నర్లను ఆడడంలో తన బలహీనతను మరో సారి బయటపెట్టుకున్నారు బ్రూక్. కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో జన్సెన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు 

హీటర్లు గా పేరున్న లివింగ్ స్టోన్, బ్రూక్ లు  ఘోరాతి ఘోరంగా విఫలమవుతున్నారు

ఇప్పటికే ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ రాజీనామా చేశాడు. కెప్టెన్ గా ఇదే ఆఖరి వన్ డే మ్యాచ్

సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జన్సెన్, ముల్డర్ లు చెరో మూడు  వికెట్లు తీయగా, స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీశాడు. ఎంగిడి, రబడా చెరో ఒక వికెట్ తీశారు