ఇంకా ప్రజల చేతుల్లోనే ఉన్న 2 వేల రూపాయల నోట్లు

by | Mar 1, 2025 | వార్తలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19, 2023 న, 2000 రూపాయల నోట్ల చలామణిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  అంటే, 2000 రూపాయల నోట్లను  రద్దు చేసి సుమారు 21 నెలల పైన అయింది

₹2000 నోట్లను డిపాజిట్ చేయడానికి మరియు / లేదా మార్పిడి చేసుకునే  సౌకర్యం అక్టోబర్ 07, 2023 వరకు దేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో అందుబాటులో ఉంది. ఆ తరవాత నుండి,  రిజర్వు బ్యాక్ అఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాల వద్ద ఈ 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు

2000 రూపాయల నోట్ల రద్దు ప్రకటించినప్పటికి, ₹3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇంకా చెలామణిలో ఉన్న ₹2000 నోట్ల మొత్తం విలువ, ఫిబ్రవరి 28, 2025 నాటికి ₹6,471 కోట్లుగా ఉంది.

₹2000 నోట్ల ఉపసంహరణ ప్రకటించిన మే 19, 2023 నుండి, చెలామణిలో ఉన్న ₹2000 నోట్లలో, 98.18% తిరిగి వచ్చాయి.

అంటే 1.82% శాతం నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయి.  వాటి విలువ 6,471 కోట్లు