ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 179 పరుగులకు చాప చుట్టేసింది
ఇప్పటిదాకా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో కూడా ఘోరంగా విఫలమైంది. ఎంతలా అంటే కేవలం 38.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు
37 పరుగులు చేసిన జో రూట్ ఇంగ్లాండ్ జట్టు లో టాప్ స్కోరర్. ఆర్చర్ 25 పరుగులు, డకెట్ 24 పరుగులు, కెప్టెన్ బట్లర్ 21 పరుగులు చేశారు. స్పిన్నర్లను ఆడడంలో తన బలహీనతను మరో సారి బయటపెట్టుకున్నారు బ్రూక్. కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో జన్సెన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు
హీటర్లు గా పేరున్న లివింగ్ స్టోన్, బ్రూక్ లు ఘోరాతి ఘోరంగా విఫలమవుతున్నారు
ఇప్పటికే ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ రాజీనామా చేశాడు. కెప్టెన్ గా ఇదే ఆఖరి వన్ డే మ్యాచ్
సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జన్సెన్, ముల్డర్ లు చెరో మూడు వికెట్లు తీయగా, స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీశాడు. ఎంగిడి, రబడా చెరో ఒక వికెట్ తీశారు
మ్యాచ్ పూర్తి కాకుండానే సౌత్ ఆఫ్రికా సెమి ఫైనల్ కు అర్హత సాధించింది.

