దుమ్మురేపుతున్న అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ టీజర్‌

by | Feb 28, 2025 | సినిమా

కోలీవుడ్ సీనియర్ హీరో అజిత్ కుమార్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. కాగా, అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజ‌ర్ ఎప్పుడు వ‌స్తుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు తీపిక‌బురునందిస్తూ.. టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఫుల్ యాక్ష‌న్ ప్యాక్డ్‌గా సాగిన ఈ టీజర్ ను మీరు చూసేయండి.

కాగా, ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. యోగిబాబు, రాహుల్‌ దేవ్‌, అర్జున్‌ దాస్‌, సునీల్‌, ప్రభు ఇతక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.