టాలీవుడ్ లో ఇప్పుడు నెంబర్ 1 ప్రౌడక్షన్ హౌస్ అంటే మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పాలి. భారీ ప్రోజెక్టుల నుండి చిన్న ప్రాజెక్ట్ ల వరకు ఎక్కడ చూసిన మైత్రి మూవీ మేకర్స్ కనపడుతున్నారు. పుష్ప 2 తో ఇండియా లోనే నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ గా అవతరించింది
గతంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగ స్థలం, పుష్ప-1, సర్కారు వారి పాట, ఉప్పెన, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ మధ్య నే పుష్ప -2 తో పాన్ ఇండియా స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చారు. 500 కోట్ల బడ్జెట్ తో తీసిన పుష్ప-2 (Pushpa) 1800 కోట్లు వసూలు చేసింది.
మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పుడు వరసపెట్టి భారీ సినిమాల మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ వారి రాబిన్ హుడ్ మార్చ్ 28 విడుదలవుతోంది. ఇది కాకుండా , అజిత్ తో గుడ్, బాడ్ అగ్లీ, సన్నీడియోల్ తో జాట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరో పక్క పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తయారవుతోంది
మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పటి వరకు ప్రభాస్ (Prabhas) తో ఇంకా సినిమా తీయలేదు. ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వం లో ఫౌజి అనే భారీ పిరియాడికల్ సినిమా తీస్తున్నారు.
ఇది ఇలా ఉంటె, రామ్ చరణ్, బుచ్చిబాబు తో పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. మరో పక్క ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో సినిమా షూట్ ఈ మధ్యనే ప్రారంభమైంది. ఇవే కాకుండా సుకుమార్, రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్ రాబోయే సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. విజయ్ దేవర కొండ తో కూడ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట
రాబిన్ హుడ్ + గుడ్, బాడ్, అగ్లీ + జాట్ + ప్రభాస్ మూవీ, రామ్ చరణ్-సుకుమార్ మూవీ, రామ్ చరణ్ బుచ్చి బాబు మూవీ + ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా + ఉస్తాద్ భగత్ సింగ్ + విజయ దేవరకొండ సినిమా – ఈ లిస్ట్ చూస్తే కొండంత ఉంది. ఈ సినిమాల ఖర్చు, బిజినెస్ సుమారు 1000-1400 కోట్లు మధ్యలో ఉంటుంది. అన్ని సినిమాలు పెద్ద స్టార్స్ తో చేశున్నవే.
ఈ రేంజ్ లో సినిమా తీసే వాళ్ళు ఇండియా లో లేరంటే అది అతిశయోక్తి కాదు. ఒకప్పుడు తెలుగు సినిమా లో దిల్ రాజు హవా ఉండేది. అది మైత్రి మూవీ మేకర్స్ రేంజ్ లో కాదు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు టాలీవుడ్ లో కూడా ఇండియా లో అతి పెద్ద నిర్మాణ సంస్థ
ఇటీవల ఆదాయ పన్ను శాఖ వారు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ల పై రైడ్ చేశారు. హనుమాన్, సలార్ వంటి భారీ చిత్రాలను నిజాం లో పంపిణి కూడా చేశారు

