రజనీ ‘కూలీ’ సాంగ్ కోసం పూజాహెగ్డే షాకింగ్ రెమ్యునరేషన్​!

by | Feb 28, 2025 | సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth) , త‌మిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’(Coolie) . సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌కు, విడుదలైన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో రజనీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో కూలీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇందులో బుట్టబొమ్మ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ పాట షూటింగ్‌ జరగ్గా, ఇందులో పూజాహెగ్డే నృత్యాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని మేకర్స్‌ అంటున్నారు.

కాగా, ఈ సాంగ్ కోసం పూజా హెగ్డే (Pooja Hegde) భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌ చేసేందుకు ఏకంగా రూ.2 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. వరుస ఫ్లాపులు ఉన్నప్పటికీ పూజాహెగ్డే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలాఉంటే.. పూజాహెగ్డేకు ఐటెంసాంగ్స్‌ కొత్తేమి కాదు. గతంలో రంగస్థలం, ఎఫ్‌-3 సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ చేసింది. కాగా, బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ‘కూలీ’ సినిమా కథ సాగనుండగా.. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి మొదటి వారంలో చెన్నై శివార్లలో వేసిన ఓ ప్రత్యేక సెట్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు కింగ్ నాగార్జున(Nagarjuna), శృతి హాసన్(Shruthi Hasan) , కన్నడ స్టార్ ఉపేంద్ర(Upendra), సత్యరాజ్, చౌబిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ ()Ameer Khan) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.