2024-25 ఈపీఎఫ్ వడ్డీ రేటును ఫిక్స్ చేసిన EPFO

by | Feb 28, 2025 | వార్తలు

2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25% గా EPFO నిర్ణయించింది.  సెంట్రల్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఈ విషయాన్నీ కేంద్ర ఆర్ధిక శాఖకు పంపుతారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తరవాత అధికారికంగా ఈ వడ్డీ రేటును ప్రకటిస్తారు

గత సంవత్సరం (2023-24) వడ్డీ రేటునే యధాతధంగా 2024-25 కు వర్తింప చేశారు.  7 కోట్ల చందాదారులకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది

2014-15, 2015-16 సంవత్సరాలలో ఈపిఎఫ్ వడ్డీ రేటు 8.8% గా ఉండేది. ఆ తరవాత 2016-2019 మధ్యలో 8.55% నుండి 8.65% గా ఉండేది.  కరోనా సమయంలో అంటే 2019-20, 2020-21 మధ్యలో ఈ పి ఎఫ్ వడ్డీ రేటు 8.5% గా ఉండేది

అప్పటి దాకా 0.10% వడ్డీ రేటును తగ్గిస్తూ వచ్చిన సెంట్రల్ బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు కేంద్ర ప్రభుత్వం, కరోనా వంటి కఠిన పరిస్థితుల తరవాత  2020-21 లో వడ్డీ రేటును 8.5% నుండి 8.10% కు తగ్గించింది

2022-23 లో ఈ వడ్డీ రేటు 8. 15% ఉండగా, గత సంవత్సరం (2023-24), ప్రస్తుత సంవత్సరం (2024-25) ఈ వడ్డీ రేటును 8. 25% కు పెంచారు.  కానీ 2015-16 నాటి 8.8% వడ్డీ రేటు మాత్రం ఇవ్వడం లేదు