కళ్యాణ్ రామ్ మూవీకి పవర్​ఫుల్​ టైటిల్​ ఫిక్స్!

by | Feb 28, 2025 | సినిమా

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NKR21 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో
సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీవీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్ శివార్లలో వేసిన ప్రత్యేక సెట్స్ లో శరవేగంగా జరుగుతోంది.

ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి వచ్చిన ఓ అప్‌డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యాక్ష‌న్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందుగా మెరుపు అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా కోసం మేకర్స్ మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రుద్ర’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. కాగా, ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.