ది ప్యారడైజ్’ – నాని అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్!

by | Feb 28, 2025 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. నాని, దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌(The Paradise)’. ఈ మూవీని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ది పారడైజ్‌ మూవీ కోసం నాని సరికొత్తగా కనిపిస్తారని తెలుస్తోంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడం, హ్యుజ్ పాపులారిటీని సాధించడంతో ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడాయి. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌ ఓదెల (Odela) ఇప్పటి వరకు ఎవరు టచ్‌ చేయని పాయింట్‌ను తీసుకుని ఈ సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి.

కాగా, ప్ర‌స్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ‘ది ప్యారడైజ్‌’ సినిమాను ఎనిమిది భాష‌ల్లో విడుద‌ల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్న‌ట్లు సమాచారం. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ టీజ‌ర్‌ని మార్చి 3న రిలీజ్ చేయనుండగా.. ఈ టీజ‌ర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్ వంటి ఎనిమిది భాషల్లో విడుద‌ల చేయబోతున్న‌ట్లు తెలుస్తుంది. కాగా, ఈ సినిమాలో నానికి జోడీగా నటించబోతున్న హీరోయిన్‌ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ సంగీతం అందింస్తున్నారు.